ఆయన ఆశయం సజీవం..
వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి రమేష్
నవతెలంగాణ – వనపర్తి
సమ సమాజ ఆశయం కోసం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డికి మరణం లేదని, ఎర్రజెండా ఉన్నంతకాలం ఆయన పేరు వర్ధిల్లుతుందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌకులో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతికి సంతాపం తెలిపారు. మాట్లాడుతూ.. సమసమాజ ఆశయం కోసం పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధుడు సురవరం వెంకట్రామారెడ్డి, పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి పోరాటాలను పునికిపుచ్చుకొని విద్యార్థి దశనుంచే ఉద్యమాలను నడిపారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సిపిఐ కీలకపాత్ర పోషించారన్నారు.
పదవుల కోసం కాకుండా ప్రజల అభ్యున్నతే కేంద్రంగా చట్టసభల్లో బయట ఉద్యమాలు నడిపారన్నారు. రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులకే వన్నెతెచ్చారన్నారు.ఆశయాలకు అంకితం కావటమే నిజమైన నివాళి కాగలదు అన్నారు.NFIW జిల్లా గౌరవ అధ్యక్షులు కళావతమ్మ, కవి జనజ్వాల, రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,NFIW జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, శ్రీదేవి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుతుబు,ఎత్తం మహేష్, రమణ,తాపీ మేస్త్రీల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, ఎస్టి ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు గంధం నాగరాజు, గోపాల్పేట మండల కార్యదర్శి శాంతయ్య, పానుగల్ మండల కార్యదర్శి డంగు కురుమయ్య, ఏదుట్ల గ్రామ కార్యదర్శి కోటయ్య, బాలేమియా, వెంకటమ్మ, జ్యోతి, సుప్రియ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సురవరంకు మరణం లేదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES