Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందిశ-దశ లేదు

దిశ-దశ లేదు

- Advertisement -


– కేంద్రబడ్జెట్‌పై మంత్రి జూపల్లి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఎలాంటి దిశ-దశ లేకుండా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాజా బడ్జెట్‌ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రాల అవసరాలను పట్టించుకోకుండా, ప్రజల ఆశలకు విరుద్ధంగా బడ్జెట్‌ ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీపై మౌనం, యువతకు ఉపాధి కల్పనపై స్పష్టత లేకపోవడం, పేదల సంక్షేమ పథకాల్లో నిధుల కోత వంటిని బడ్జెట్‌లో ప్రధాన లోపాలని వివరించారు. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు అద్భుత పర్యాటక సంపద ఉందనీ, తెలంగాణను గ్లోబల్‌ టూరిజం హబ్‌గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కేంద్రం నుంచి మద్దతు లభించలేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి సారం లేదనడానికి స్టాక్‌ మార్కెట్ల పతనమే నిదర్శనమని ఉదహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -