Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టులకు భయపడేది లేదు..

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : లంబాడి ఆత్మ గౌరవ వేదిక చలో హైదరాబాద్ ఇందిరా పార్కు సభను విజయవంతం చేయాలని జుక్కల్ మండల లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జాదో రాజు, సభ్యులకు జుక్కల్ పోలీసులు అరెస్టులు చేశి పిఎస్ శుక్రవారం నాడు తరలించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన మండల లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు జాదో రాజు, సభ్యులు మాట్లాడుతూ.. తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే , అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు  లంబాడీలను ఎస్టి నుండి తీసివేయలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.

కావున దాని సందర్భంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి  (LHPS) ఆధ్వర్యంలో తరఫున వెళ్తున్న క్రమంలో అక్రమ అరెస్టులు  పోలీసులు  చేశారని తెలిపారు. లంబాడ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు జాదవ్ రాజు, మండల యూత్ అధ్యక్షులు, పలువురు సభ్యులను  శుక్రవారం నాడు తేదీ 19 సెప్టెంబర్ న ఉదయం 6 గంటలకు జుక్కల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీని తీవ్రంగా ఖండిస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేస్తే  భయపడేది లేదని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -