Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలో గ్యాస్‌ కొరత లేదు

దేశంలో గ్యాస్‌ కొరత లేదు

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశంలో గ్యాస్‌ కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ రామచందర్‌రావు చెప్పారు. కొంతమంది కావాలనే కొరతను సృష్టిస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్‌ ధరలు పెరిగాయి. మన దేశంలో మాత్రం పెరగలేదు. మోడీ ప్రభుత్వం ఈ ధరలను నియంత్రణలో పెట్టింది. గతంలో గ్యాస్‌ ధర రూ.1,200 ఉంటే.. మోడీ ప్రభుత్వం రూ.900కు తగ్గించింది’ అన్నారు. మూసీ పునరుజ్జీవానికి, ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. అయితే, 50 మీటర్ల బఫర్‌ జోన్‌ అనేది అవసరం లేదని చెప్పారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలా? గుజరాత్‌లో ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -