పున్నం చందర్ నేతాజీ నగర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
తల్లిదండ్రులను మించిన దైవం వేరే లేదని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత చేసిన తక్కువేనని నేతాజీ నగర్ గ్రామానికి చెందిన మాజీ పంచాయతీ వార్డు సభ్యులు పున్నం చందర్ అన్నారు. ఆదివారం మీడియాతో పున్నమి చందర్ మాట్లాడుతూ కస్న నాయక్ 98, సాలమ్మ 95 మా తల్లిదండ్రులు ఇప్పటికీ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని అన్నారు. మా తల్లిదండ్రులకు మేము నలుగురం అన్నదమ్ములం ముగ్గురు కుమార్తెలు మొత్తం ఏడుగురు సంతానం ఉన్నాం. మా తల్లిదండ్రుల కోరిక మేరకు మా అన్నదమ్ములు ఆడపిల్లలు వారి పిల్లల పిల్లలు అందరం మా తండ్రి స్వగ్రామమైన గోవిందాపురంలో తల్లిదండ్రులను సన్మానిస్తూ అందరం కలుసుకోవడం జరిగిందని అన్నారు.
మూడు తరాల కు చెందిన వాళ్ళం ఒకే వేదిక మీద మా తల్లిదండ్రుల కోసం కలవడం ఒక అపూర్వ కలయికగా జరిగిందన్నారు. తల్లిదండ్రులు 100 వసంతాలను పూర్తి చేసుకో బోయ సమయంలో చేసిన ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారని అన్నారు. కాగా ఈ కార్యక్రమం గ్రామస్తులను ఎంతో స్ఫూర్తిని నింపింది. పున్నం చందర్ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు కొనియాడారు. తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా హింసిస్తున్న కొడుకులను చూస్తున్న ఈరోజుల్లో వందమంది కుటుంబ సభ్యులు ఒక చాటు మీద చేరి నిర్వహించిన వేడుక అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.



