Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనా వెనక ఏ జాతీయ పార్టీ లేదు

నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు

- Advertisement -

20 ఏండ్లు బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డాను : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన వెనక ఏ జాతీయ పార్టీ లేదనీ, సొంత పార్టీ పెట్టడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాను 20 ఏండ్లు బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డానని తెలిపారు. జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి తెలంగాణ ప్రవాసీయులతో ముఖాముఖి ముచ్చటించారు. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌లో చీలికలు రావొద్దనే ఉద్దేశంతో ఎంత ఇబ్బంది అయినా తట్టుకొని నిలబడ్డానని చెప్పారు. తనకు పార్టీలో అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని ఆరోపించారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తనను పార్టీ నుంచి బయటికి పంపడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశాననీ.. చైర్మెన్‌ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదన్నారు. కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఆ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం ముందుండి కొట్లాడి సాధించుకున్నామనీ, బీసీ రిజర్వేషన్ల కోసం తానే ముందుండి పోరాటం చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -