Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసాపై జాప్యం తగదు

రైతు భరోసాపై జాప్యం తగదు

- Advertisement -

రైతు సంఘం జిల్లా నాయకుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం తగదని రైతు సంఘం జిల్లా నాయకుడు అక్కల బాపు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన కేబినెట్ లో రైతు భరోసా ప్రకటన రాకపోవడంతో రైతులకు నిరాశ మిగిలించిందని అన్నారు. నల్లగొండ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా కోసం రూ.9 వేల కోట్ల నిధులు సిద్ధం చేశామని, రైతుల ఖాతాలో త్వరలోనే వేస్తామని అన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వేయకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా రైతు బంధు వెంటనే వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -