నవతెలంగాణ – భిక్కనూర్
ప్రపంచంలో రైతులను మించిన వారు లేరని గోరంటి వెంకన్న అన్నారు. మండలంలోని లక్ష్మీదేవుపల్లిలో గ్రామంలో కొత్త ఎల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని గోరటి వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షులు రాంరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేశ్, నాయ్యవాది సిద్ధిరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కొత్త నర్సింలు, అఖిల పక్ష నాయకులు నరేందర్‌రెడ్డి, హన్మంత్ నర్సారెడ్డి, నర్సింలు, సిద్ధరాములు, వీడీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలో రైతులను మించిన వారు లేరు: గోరటి వెంకన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES