నవతెలంగాణ – జన్నారం : ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని హరిత రిసార్ట్లో గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. మంగళవారం చివరి రోజు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ..కులం మతం పేరుతో బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేస్తుందని, ఆదివాసీలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆదివాసీలకు పెద్దపీట వేసిందని అన్నారు. అదాని, అంబానీల సంపదను పెంచడానికి కోసం బిజెపి ప్రభుత్వం మైనింగ్ ల పేరిట అడవులను కట్టబెడుతుందని ఆదివాసీల అభివృద్ధికి ఏ మాత్రం కూడా కృషి చేయలేదని అన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ లు కులం మతాన్ని నమ్ముతారని ఆదివాసీలు మాత్రం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్ముతారని, అందుకు నిదర్శనమే ఈ రోజు నేను మంత్రిగా మీ ముందున్నాని అన్నారు. పేద ఇంటిలో పుట్టిన నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ,ఒకసారి మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.
ఆదివాసీల ఆణిచివేతకు బిజెపి ప్రభుత్వం పనిచేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆదివాసీలను అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని, ఆదివాసీలను అన్ని రంగాలలో తీర్చి దిద్దాడానికి ఇప్పటివరకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదని కేవలం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ జాతీయ కన్వీనర్ కొప్పు రాజు, ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బేల్లయ్య నాయక్, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి,శ్యామ్ నాయక్, ఏఐసీసీ జాతీయ కన్వీనర్ రాహుల్ బాల్, ప్రోగ్రాం ఇన్చార్జి రానాప్రతాప్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్ అలీఖాన్,మేకల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, ఎం.రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్ రమేష్ ఇందయ్యా , అజ్మీర నందునాయక్, దాముఖ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..
ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES