నవతెలంగాణ-హైదరాబాద్: తమకు న్యాయం లభించే వరకు ఢిల్లీ వదిలి వెళ్లామని ఉన్నావ్ బాధితురాలు తల్లి స్పష్టం చేసింది. న్యాయం కోసం ధర్నా చేస్తున్న తన బిడ్డను బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారని, దారి మధ్యన తనను వదిలేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీద్‌ప్ సెగర్‌కు బెయిల్ రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తమకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు సదురు ఎమ్మెల్యే బెయిల్ రద్దు చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన కూతురుకు న్యాయం లభించే వరకు ఢిల్లీ వదిలి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించింది. ఈ కేసులో తమకు సరైన పద్ధతిలో న్యాయం లభించలేదని వాపోయింది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమను భద్రతా బలగాలు చంపేయలని చూస్తున్నాయని ఆరోపించింది. CRPF వాహనంలో తను కూతురును తరలించారని పేర్కొంది. కుల్ద్‌ప్ సెగార్ బెయిల్ రద్దు చేయకుంటే ఢిల్లీ వదలమని, లేకుంటే తమ ప్రాణాలను త్యాగం చేస్తామని చెప్పారు. ప్రధాన నిందితునికి బెయిల్ మంజూరుతో తమ ప్రాణాలకు భద్రతా లేదని, వారి అనుచరులతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రముఖ సంఘ సంస్కర్త యోగిత భయ్యాన కూడా భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధితుల తరుపున తాను నిరసనలో పాల్గొన్నాను, తాను చూస్తుండగానే అధికారులు బాధితురాలిని తరలించారు, ఆమె తల్లిని నడిరోడ్డు మీద లాగి పడేశారని మండిపడ్డారు. బాధితులకు న్యాయమంటే ఇదేనా అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని మీడియా వేదికగా ప్రశ్నించారు.
కాగా, ఉన్నావ్ లైంగికదాడి కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు.



