పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

– మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి
నవతెలంగాణ-కొత్తగూడెం
జూన్‌ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని పారిశుధ్యంలో అగ్రభాగాన నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన (రెడ్యూస్‌, రీ-యూస్‌, రీ-సైకిల్‌) ఆర్‌ఆర్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ మొదట నిలవాలన్నారు. ఈ సందర్భంగా మేరీ లైఫ్‌ ప్రతిజ్ఞను రిసోర్స్‌ పర్సన్స్‌, శానిటేషన్‌ సిబ్బందితో నిర్వహించారు. ప్రతి ఇంట్లో పనికి రాని, ఉపయోగించని వస్తువులను ఆర్‌ఆర్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డులలో ఉన్న సెంటర్ల ద్వారా సేకరించి, వాటిలో వాడుకోగలిగిన వస్తువులను అవసరం ఉన్న ఇతర ప్రజలకి అందజే యాలన్నారు. మిగిలిన వాటిని రీసైక్లింగ్‌ పరిశ్రమకు తరలించాలని సూచించారు. కొత్తగూడెం మునిస ిపాలిటీని పారిశుద్ధ్య విభాగంలో అగ్రభాగాన నిలపడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడగ లిగితే భవిష్యత్‌ తరాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, మెప్మా, ఆర్పీ సిబ్బందికి తెలిపారు. 36 వార్డులలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ జరిగిందని, ప్రజలందరు పంపిణీ చేసిన చెత్త బుట్టలలో ప్రతి రోజు తడి పొడి చెత్తను వేరు పరిచి అందించే విధంగా మెప్మా లు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ జి.రఘు, డిఎంసీ రాజేష్‌, టిఎంసిలు నాగయ్య, వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్పెక్టర్లు అశోక్‌ చౌహాన్‌, వీరభద్ర చారీ, సిఓలు సరిత, శాంత కుమర్‌, మౌలానా, ఆర్పీలు, ఓబిలు పాల్గొన్నారు.
కంటి వెలుగు కేంద్రం ప్రారంభించిన చైర్పర్సన్‌ కాపు సీతా లక్ష్మి
కొత్తగూడెం మున్సిపల్‌ పరిధిలోని 14వ వార్డులో కౌన్సిలర్‌ అఫ్జల్‌ ఉన్నిసా బేగం ఆధ్వర్యంలో కంటి వెలుగు కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి ప్రారం భించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్‌ మాట్లాడుతూ మాన వుని దేహంలో ముఖ్యమైన భాగం కన్ను అని అటువంటి కన్ను లేనిదే జీవితం శూన్యమని తెలిపారు. పరీక్షలు నిర్వహించి వెంటనే కళ్ళజోడు పంపిణీ చేయడం జరుగు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మౌనిక, బిఆర్‌ఎస్‌ నాయకులు రజాక్‌, వార్డు ప్రజలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love