నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయి గూడెం మండలంలో గ్యాస్ పై తప్పుడు ప్రచారాలు వస్తున్నాయని తహశీల్దార్ సర్వర్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధాల కారణాలవల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. మండలంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజల ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే గృహ అవసరాల కోసం సబ్సిడీపై ఇచ్చే ఎరుపు రంగు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటల్లో గాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టీ స్టాల్ లో వాడరాదని, చట్టరీత్యా నేరమని తెలిపారు. వ్యాపారం కొరకు నీలిరంగు సిలిండర్లనే వాడాలని ఈ సందర్భంగా వ్యాపారులకు హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక రేట్లు విక్రయించినట్లయితే వారిపై స్థానిక ఎస్సై, తహశీల్దార్ లు కఠిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు.
కన్నాయిగూడెంలో వంటగ్యాస్ కొరత లేదు: తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



