Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంఎరువుల కొరత లేదు

ఎరువుల కొరత లేదు

- Advertisement -

కేంద్ర ఎరువుల శాఖమంత్రి జేపీ నడ్డా
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో

ఎరువుల కొరత లేదని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఎరువులు, ముడి పదార్ధాల రవాణాలో ఆలస్యం చోటుచేసుకుని రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తున్న వార్తలపై శుక్రవారం ఆయన లోక్‌సభలో స్పందించారు. ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ముడిసరుకుల దిగుమతి విషయంపై ఒక్క దేశంపైనే ఆధారపడకుండా ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇప్పటికే పలు దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నామని నడ్డా వివరించారు. ఔషధాల తయారీకి ఇతర దేశాల నుంచి ముడిసరుకు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -