Monday, December 29, 2025
E-PAPER
Homeకరీంనగర్జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లాలో ఎరువుల కొరత లేదు

- Advertisement -

రైతులు ఆందోళన చెందవద్దు
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా.. ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందని సూచించారు. కనీస సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

జిల్లాలో యాసంగి సాగు కోసం మొత్తం 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి దాకా 10 వేల 991 మెట్రిక్ టన్నులు వచ్చిందని వెల్లడించారు. మిగతా ఎరువులు తెప్పిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ డీలర్లు 223, పీసీసీఎస్ షాపులు 54, డీసీఎంఎస్ 16,  ఏఆర్ ఎస్ కే 13 ఎరువుల షాపులు ఉన్నాయని వెల్లడించారు. అన్ని షాప్ లలో రోజూ ఉదయం ఆరు గంటల నుంచి విక్రయాలు మొదలు పెట్టాలని, ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -