Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోషల్ మీడియలో అవాకులు చివాకులు పేల్చితే ఊరుకునేది లేదు 

సోషల్ మీడియలో అవాకులు చివాకులు పేల్చితే ఊరుకునేది లేదు 

- Advertisement -

రూరల్ అభివృద్దిపై  చర్చకు మేము సిద్దం – జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ 
నవతెలంగాణ- దర్పల్లి

ఖబర్డర్ దినేష్ కులచారి,రూరల్ నియోజకవర్గం అభివృద్ది పై రూరల్ ఎమ్మెల్యే డా ,భూపతి రెడ్డిపై నిన్న సోషల్ మీడియాలో అవాకులు చివాకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రామ వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ అభివృద్దికి బాటలు వేస్తుంటే, అది జీర్ణించుకోలేక బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ సోషల్ మీడియాలో తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఇష్టమా వచ్చినట్లు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటుక,ఇసుక,మొరం అంటూ చిల్లర పదాలు మాట్లాడటం అవివేకమని అన్నారు. ఎవరి పార్టీ వారికి గొప్ప ,మా పార్టీ మాకు గొప్ప అని అన్నారు.

పార్టీలు మార్చి యాక్సిడెంటల్ ఎమ్మెల్యే అంటావా ! ముందు నీచారిత్ర తెలుసుకొని మాట్లాడు ముందు టిడిపి తర్వాత టీఆర్ఎస్ ఆతర్వాత బిజేపి ఇంత చరిత్ర నీది నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.మార్కెట్ కమిటీలో బాజిరెడ్డి స్థానం కల్పిస్తే ఒక్క సంవస్తారనికే అక్కడి నుండి నిన్ను గెంటేశారు అక్కడ నువ్వేం తప్పు చేశావాని  గెంటేశారు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల పకృతి వైపరిత్యనికి అకాల వర్షాలకు పంటలు నష్టం జరిగితే ,నీపార్టీ తరపున రైతుల వద్దకు వెళ్ళి వారిని ఓదార్చు సానుభూతి వ్యక్తం చెయ్యు ,దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులను అదుకో కానీ ఇలాంచీ చిల్లర మాటలు మాట్లాడకు అని ఎద్దేవా చేశారు.రైతులు బిజేపి కి ఓట్లు వెయ్యలేద !మరేందుకు ఎంపీ ద్వారా ఆర్థిక నష్టం ఇప్పియ్యావని ప్రశ్నించారు.

రైతు సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టం ఎప్పుడెప్పుడు ,యేసంవస్తారం  ఎంత సహాయం చేసిందో నివేదికను పత్రికల ముఖ్యంగా ఆయన చదివి వినిపించారు. అందులో బిజేపి పార్టీకి చెందిమన రైతులు కూడా ఉన్నారని,అంతెందుకు ఇందిరమ్మ ఇండ్లు సైత మీ పార్టీవారిని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.సమస్యలపై గాని స్థానిక రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేని నాయకుడని స్పష్టం అవుతుందని అన్నారు.ఇప్పటికైనా రూరల్ అభివృద్ధి పై చర్చకు మేము సిద్దామని అన్నారు . కార్యక్రమములో పార్టీ సర్పంచులు చెలిమెల శ్రీనివాస్,గాదె నరేష్,మాజీ సొసైటీ చెర్మెన్ చెలిమెల మల్లికార్జున్,ఉపసర్పంచ్ శ్రీకాంత్,మగ్గిడి స్రవంతి ,వై గంగారెడ్డి,చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -