Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గురువు లేనిది మనుగడ లేదు 

గురువు లేనిది మనుగడ లేదు 

- Advertisement -

నలంద పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం 
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

గురువు లేనిది మనుగడ లేదని నలంద పాఠశాల అధ్యక్షులు అట్లూరు కిషన్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నగరం లోని నలంద పాఠశాలలో విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులుగా స్వయంపాలన దినోత్సన్ని వ్యవహరించారు. పాఠశాల యాజమాన్యులు డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి పూజించారు. అనంతరం పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ మాట్లాడుతూ మనిషి జీవితంలో అతి ముఖ్యమైనపాత్ర గురువుదని, గురువు లేనిది విద్య లేదు అని, విద్యలేనిది మనిషి మనుగడలేదు అని అన్నారు.

అందుకే గురువును దైవంగా భావించి, గౌరవించాలని సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో పాల్గొని గెలుపొందిన ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యులు బహుమతి ప్రధానం చేశారు. సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులను శాలువతో సత్కరించారు. జిల్లా, రాష్ట్రస్థాయి యోగ విన్యాస పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు అన్షుమంత్ , వజ్రపవార్ పవిత్ర , తదితరులను పతకాన్ని, సర్టిఫికెట్స్ ను అందజేసారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఎన్. ప్రకాశం, ప్రదాన కార్యదర్శి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబరు నేహ, ప్రధానోపాధ్యాయిని పద్మావతి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad