– ప్రభుత్వంపై విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి
నవతెలంగాణ – కామారెడ్డి : ప్రజా పాలన ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిప్ప దుర్గాప్రసాద్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు మూడు నెలలు గడిచినా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. దివ్యాంగుల పెన్షన్ రూ.6,000, తీవ్ర వైకల్యం గల వారికి రూ.15,000, దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు, ఉచిత రవాణా సౌకర్యం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్, బధిరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వంటి హామీలు ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల సమస్యలను పట్టించుకోకపోవడం సమాజాన్ని చిన్నచూపు చూడటమేనని పేర్కొంటూ, ఇప్పటికైనా మొత్తం బడ్జెట్లో దివ్యాంగుల చట్టం ప్రకారం 5 శాతం నిధులను కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడి నర్సింలు, రంగ్యనాయక్, నితీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల బడ్జెట్లో శూన్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



