మెక్సికో అధ్యక్షురాలు షబ్నం వ్యాఖ్యలు
కారకస్ : మాదకద్రవ్యాల రవాణా, నార్కో టెర్రరిజం అభియోగాలపై ప్రస్తుతం అమెరికాలో విచారణను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోకు అవసరమైన లీగల్ ఫీజులను చెల్లించేందుకు వెనిజులాను అనుమతించకపోవడంపై ప్రధానంగా సమస్య తలెత్తింది. అమెరికా ఆంక్షలు కారణంగా వెనిజులా ఆ నిధులను చెల్లించలేకపోతోంది. ఇది తమ క్లయింట్ లీగల్ సాయాన్ని పొందే హక్కును ఉల్లంఘిస్తోందని మదురో తరపు న్యాయవాది బారీ జె.పొలాక్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురో డిఫెన్స్ కోసం వెనిజులా ప్రభుత్వ నిధులను ఉపయోగించవచ్చంటూ మెక్సికో అధ్యక్షురాలు షబ్నం మద్దతునిచ్చారు. వాటిని ఉపయోగించకూడదు అనడానికి తనకెలాంటి కారణం కనిపించడం లేదన్నారు. వెనిజులా పాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్‌తో తాను మాట్లాడే అవకాశం ఇప్పటివరకు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నెల 26న మన్‌హటన్ జిల్లా కోర్టులో జరిగిన విచారణకు మదురో దంపతులు హాజరయ్యారు. మదురో తరపు న్యాయవాది పొలాక్ తన వాదనలు వినిపించారు. అయితే వెనిజులా ప్రభుత్వ నిధులు పొందేందుకు అనుమతిస్తే తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘించబడతాయని అమెరికా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయడానికి న్యాయమూర్తి అల్విన్ హెల్లర్‌స్టెన్ నిరాకరించారు. నిధులను నిలుపు చేయడంలో లాజిక్‌ను ప్రశ్నించారు.
మదురో డిఫెన్స్‌కు వెనిజులా నిధులు ఉపయోగించడంలో తప్పులేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



