అందుకే విచారణకు ఆదేశించాం
ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఉంది
‘ఫుట్‌బాల్’ ప్రయివేటు ప్రోగ్రాం
నేను అతిధిని మాత్రమే : మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణల్లో బలం ఉండొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై భూకబ్జాలు సహా అనేక ఆరోపణలు ఆమె చేస్తున్నారనీ, విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. గురువారంనాడాయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. భవిష్యత్‌లో కవితతోసహా ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిపాలనను సులభతరం చేసేందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించామనీ, దీనివల్ల అభివృద్ధి క్రమపద్ధతిలో జరుగుతుందని తెలిపారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందనీ, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌కు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) నుంచి అనుమతి రావల్సి ఉందనీ, అవి రాగానే చర్యలు ఉంటాయని చెప్పారు. పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకే తాను మనవడితో కలిసి మెస్సీ ఫుట్‌బాల్ ఆటలో పాల్గొన్నానని తెలిపారు. అది పూర్తిగా ప్రయివేటు కార్యక్రమం అనీ, దీనిపై బీఆర్‌ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ లాగా పబ్బులు, గబ్బుల చుట్టూ పిల్లల్ని తిప్పడం లేదని కాస్తంత పరుషంగానే వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి తాను అతిథిని మాత్రమేననీ, ఆ ప్రోగ్రాంకు సింగరేణి యాజమాన్యం సీఎస్‌ఆర్ ఫండ్ నుంచి రూ.10 కోట్ల ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. తాను కేసీఆర్‌ను ఓడించి ముఖ్యమంత్రి అయ్యాననే విషయాన్ని గమనించాలని చెప్పారు. కేంద్రానికి గాంధీ అంటే ఇష్టం లేదనీ, పేదలకు పని కల్పించలేక, కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు.
కవిత ఆరోపణల్లో బలం ఉండొచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



