ప్రభుత్వ వైఫల్యాలను తిప్పి కొట్టాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – పెద్దవంగర : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన ఎంపీటీసీల క్లస్టర్ల వారిగా సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం తో పాటుగా ఐదు మండలాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అట్టర్ ప్లాప్ అయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేటీఆర్ చాలెంజ్ ను స్వీకరించకుండా ఢిల్లీకి పారిపోయాడన్నారు. కాంగ్రెస్ 420 హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వం రూ. 1000 కోట్ల తో మిషన్ భగీరథ త్రాగునీరు ప్రజలకు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల హడావిడి ఎన్నికల కోసమేనని, ఆ తర్వాత పైసా కూడా ఇవ్వరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు సమన్వయంతో కష్టపడి పనిచేయని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, నాయకులు శ్రీరామ్ సుధీర్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, అనపురం రవి, యూత్ నాయకులు కాసాని హరీష్, చింతల భాస్కర్, శ్రీరాం రాము, నిమ్మల విజయ శ్రీనివాస్, పోలకొండ కృష్ణమూర్తి, చిలుక బిక్షపతి, సుభాష్, అనుదీప్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES