Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాంసం అమ్మకాలపై ఓ విధానముండాలి : హైకోర్టు

మాంసం అమ్మకాలపై ఓ విధానముండాలి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఆలయం, విద్యా సంస్థలకు వంద మీటర్ల వరకు మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధన తరహాలో మాంసం దుకాణాల విషయంలో ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలంది. పరిశుభ్రత, ట్రాఫిక్‌ సమస్యలనూ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలనీ, గ్రామీణ, పట్టణాభివృద్ధి, హోంశాఖలను ఆదేశిస్తూ విజరుసేన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నగరం నాంపల్లిలో లైసెన్స్‌ తీసుకుని హోటల్‌ నిర్వహిస్తుంటే పోలీసులు పదేపదే జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్‌లో ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధానం ప్రకటించే వరకు పిటిషనర్‌ షాపు విషయంలో స్టేటస్‌కో కొనసాగించాలన్నారు. పిటిషన్‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించారు.

ఆక్రమణల తొలగింపు చర్యలపై స్టే ఇవ్వబోం
హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని శ్రీబన్సూరి కృష్ణ మందిరానికి చెందిన 2.34 ఎకరాల స్థలంలోని ఆక్రమణల తొలగింపు చర్యలను నిలిపివేస్తూ స్టే ఇవ్వబోమని హైకోర్టు ప్రకటించింది. సైదాబాద్‌లోని సర్వే నెంబర్‌ 110లో దేవాలయానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిపై ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను పలువురు సవాలు చేసిన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్‌ వేయాలని దేవాదాయ శాఖకు నోటీసులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -