Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఒక వ్యవస్థ ఉండాలి

ఒక వ్యవస్థ ఉండాలి

- Advertisement -

– డేటా సేకరణలో ప్రమాణీకరణ తప్పనిసరి
– లేకపోతే ప్రక్రియలో ఇబ్బందులు..లెక్కల్లో తేడాలు
– కులగణనకు ముందే చట్టపరంగా సంస్కరణలు అవసరం
– కేంద్రానికి మేధావులు, నిపుణుల సూచనలు
న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించటంతో ఈ అంశంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. కేంద్రం దీనిపై ఇంకా విధి, విధానాలు ప్రకటించాల్సిన నేపథ్యంలో అందరిలోనూ అనేక ప్రశ్నలు, సవాళ్లు, అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశంలోని పలువురు నిపుణులు కేంద్రానికి అనేక సలహాలు, సూచనలు చేస్తున్నారు. జనాభాలెక్కలతో పాటు జరపబోయే కులగణనలో సేకరించిన డేటాకు సంబంధించి అభ్యంతరాలు, దిద్దుబాట్లకు ఎలాంటి అవకాశమూ ఉండదు. ఎందుకంటే.. చట్టం వ్యక్తిగత వివరాలపై గోప్యతను తప్పనిసరి చేస్తుంది. దీనిని పాటించకపోతే అధికారులపై చర్యలకు అవకాశాలుంటాయి. కాబట్టి.. ఈ ప్రక్రియ చేపట్టే ముందు చట్టానికి తగిన సవరణలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.జనగణనలో దేశ జనాభా సామాజిక, జనాభా, ఆర్థిక డేటాను విశ్లేషిస్తారు. 2011-12లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక-ఆర్థిక కుల గణన (సెక్‌)ను నిర్వహించింది. కానీ ఇది జనాభా లెక్కల చట్టం కింద జరగలేదు. సేకరించిన వ్యక్తిగత గృహాల ఆర్థిక డేటాను గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ సర్కారు నిర్వహించిన గణనకు సంబంధించి తప్పులను పేర్కొంటూ ఆర్థిక డేటాను విడుదల చేసింది. కానీ.. కుల గణాంకాలను మాత్రం విడుదల చేయలేదు. జనాభా లెక్కల చట్టం కింద సేకరించిన డేటాను ఏ పబ్లిక్‌ డొమైన్‌లోనూ ప్రచురించలేమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ అన్నారు. ”సేకరించబడిన వ్యక్తిగత డేటా బహిరంగంగా ప్రచురించబడదు. ఎన్యుమరేటర్లు(గణనదారులు) ఏ డేటాను సంగ్రహిస్తారో.. అదే తుది డేటా అవుతుంది” అని ఆయన తెలిపారు.
ప్రామాణీకరణ లేకుంటే డేటాలో తప్పులకు ఆస్కారం
పాట్నాలోని ఎఎన్‌ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ మాజీ డైరెక్టర్‌, ఆర్థిక ప్రొఫెసర్‌ సునీల్‌ రే మాట్లాడుతూ.. ”జనాభా లెక్కల ప్రకారం సామాజిక, ఆర్థిక భేదాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా సంగ్రహించటం కోసం అవసరమైన డేటాను ప్రామాణీకరించటానికి(అథంటికేషన్‌) ఒక వ్యవస్థ ఉండాలి. కచ్చితమైన డేటాను పొందటానికి బలమైన పద్ధతి కలిగిన ప్రక్రియ కీలకం. గ్రామ సర్పంచ్‌ లేదా అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో కొంత ప్రామాణీకరణ ఉండాలి. ప్రామాణీకరణ లేకుంటే డేటా సేకరణలో లేదా క్షేత్ర స్థాయిలో డేటాను తప్పుగా నివేదించటంలో చాలా అంతరాలుంటాయి” అని అన్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు ప్రభుత్వం ఈ అంశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కులగణన విషయంలో క్రెడిట్‌ కోసం ఇటు అధికార పక్షం, అటు ప్రధాన ప్రతిపక్షం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిని మేధావులు, నిపుణులు తప్పుబడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఈ లెక్కలు చాలా అవసరం. కాబట్టి.. ఈ విషయంలో కేంద్రం.. ప్రతిపక్షాలు, మేధావులు చేసే సూచనలను పరిగణలోకి తీసుకొని జన,కుల గణనలకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు.
కుల ధృవీకరణ ఇబ్బందులు
గతంలో జనాభా లెక్కలు షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీలు) మొత్తం డేటాను సేకరించాయనీ, కానీ ఆ వర్గాలలోని కులాలవారీగా సమాచారాన్ని సేకరించలేదని గుర్తు చేశారు. జాతీయ గణాంక కమిషన్‌ మాజీ తాత్కాలిక చైర్‌పర్సన్‌ పి.సి మోహనన్‌ మాట్లాడుతూ.. ”జనాభా లెక్కల సమయం లో కులధృవీకరణ కష్టం కావచ్చు. మతం లేదా ఎస్సీ, ఎస్టీల కోసం డేటా వెరిఫికేషన్‌ జరగదు. నివేదించబడి న కులం, మతం.. కులాలు, మతాల జాబితాలో ఉన్న వాటితో సరిపోలుతున్నాయో లేదో మాత్రమే గణనదా రులు తనిఖీ చేయగలరు. ముందుగానే కులాల జాబితా ను కలిగి ఉండటం అవసరం. లేకపోతే, డేటాను ప్రాసెస్‌ చేయటం కష్టమవుతుంది” అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad