Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాది పనుల్లో అవతవకలు లేకుండా చూడాలి..

ఉపాది పనుల్లో అవతవకలు లేకుండా చూడాలి..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : పేదల కొరకు ఉద్దేశించబడిన  ఉపాధి హామీ పథకాన్ని ఎటువంటి అపకతవకలు లేకుండా గ్రామాలలో అమలు జరపాలని  డిఆర్డిఓ సాయగౌడ్  తెలిపారు. పట్టణంలోని  మండల పరిషత్ కార్యాలయం ఎందు మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం  మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా రైతులు లబ్ధి పొందే విధంగా ఉపాధి హామీలో పండ్ల పెంపకం, గడ్డి పెంపకం, పశువుల కొట్టాలు  ఇంకా ఇతర పనులను చేపట్టుకోవచ్చు అని అన్నారు.  ఇట్టి పనుల యొక్క విలువ రూ.7 కోట్లన్నారు. ఈ కార్యక్రమంలో  డి వివో నారాయణ , ఎంపీడీవో బ్రహ్మానందం , పూర్వ ఎంపీడీవో సాయిరాం,ఏ ఈ  నితీష్ కుమార్, ఏపీఓ సురేష్, ఈసీ ప్రశాంత్, సాంకేతిక సహాయకులు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్ స్ , సామాజిక తనిఖీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -