పీసీసీ అధికార ప్రతినిధి. ఏ బి శ్రీనివాస్
నవతెలంగాణ – ఆర్మూర్
రాజకీయాల్లో విలువలు హుందాతనం ఉండాలని పిసిసి అధికార ప్రతినిధి ఏపీ శ్రీనివాస్ అన్నారు. పట్టణ కేంద్రంలో గురువారం మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో విలువలు హుందాతనంగా ఉండాలి కాని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతి భ్రమించి దిగజరుడు భాష మాట్లాడతున్నాడని అన్నారు. సుదర్శన్ రెడ్డి పట్ల ఇంకోసారి అగౌరవ భాష మాట్లాడితే నాలుక ఛీరేస్తాం అని, సుదర్శన్ రెడ్డి కాలి గోటికి కూడ సరిపోదు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నట్లు నేను ఎవరినైనా బెదిరించినట్లు నిరూపిస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటాను అని, మీడియా మిత్రులే నేరుగా జీవన్ రెడ్డి చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్లి నిజానిర్దారణ చేయాలి అని అన్నారు.
బెదిరించే సంస్కృతి జీవన్ రెడ్డి ది అని గతం లో ప్రజలను ఎలా బెదిరించాడు అని తమ్ముడిని ఇంచార్జ్ గా పెట్టి వసూళ్లు చేసిన ఘనత అని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ రెండంకల సంఖ్య తెచ్చుకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అని, జీవన్ రెడ్డి ఎం చేస్తాడో చెప్పాలి అని అన్నారు. రౌడీ షీటర్ లకు ఫ్లెక్సీలు కడుతు పదవిని దిగజార్చావు అని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ వస్తున్న ఆదరణ చూసే మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని తట్టుకోలేక పిచ్చి కూతలు కుస్తున్నాడు అని అన్నారు. ప్రజలు రేవంత్ అన్న పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని అన్నారు. అందరం కలిసి ఐక్యంగా కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.



