రీ సర్వే చేయాలి: తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-కేశంపేట
పెద్దల భూములను కాపాడటానికి త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి.. పేదల కడుపు కొట్టడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో గురువారం రాత్రి త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. జాగృతి తాలూకా కన్వీనర్ సీమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడారు. తొమ్మిది రేకుల, నిర్దవెళ్లి గ్రామాలకు చెందిన పేద రైతుల 200 ఎకరాల భూములు కోల్పోవడం బాధాకరమన్నారు.
ఉత్తర భాగాన సెంట్రల్ బస్‌స్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు కాకుండా ఓఆర్‌ఆర్ నుంచి 25 కి.మీటర్లకు త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ తీసుకోవడంతో పేద రైతులు భూములు కోల్పోతున్నట్టు తెలిపారు. రింగ్ రోడ్డు అంటే ఒక రింగులా ఉండాలి కానీ, నీటిలోని నీరుకట్టేలా వంకర టింకరగా ఉండటమేమిటని ఎద్దేవా చేశారు. త్రిబుల్‌ఆర్ కోసం రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
త్రిబుల్‌ఆర్‌లో జరుగుతున్నది పెద్ద కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



