Monday, September 29, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారం మండల సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇవే..

జన్నారం మండల సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇవే..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను తయారు చేయడం జరిగిందని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీ మహిళ అలాగే తిమ్మాపూర్ ఎస్టీ జనరల్, ఇంధన్ పల్లి ఎస్టీ జనరల్, కవ్వాల్ ఎస్టీ జనరల్, బంగారు తండా ఎస్టీ మహిళ, హాస్టల్ తండా ఎస్టీ జనరల్, మల్యాల్ ఎస్టీ మహిళ, లోతొర్రే ఎస్టీ జనరల్, సింగరాయ పెట్ ఎస్టి మహిళకు కేటాయించడం జరిగిందని తెలిపారు. 

అదేవిధంగా మొర్రిగూడ ఎస్సీ మహిళ, రోటి గూడ ఎస్సీ జనరల్, మహమ్మదాబాద్ ఎస్సీ మహిళ, బాదంపల్లి ఎస్సీ మహిళ, తపాలాపూర్ ఎస్సీ జనరల్, దేవుని గూడా ఎస్సీ జనరల్ అలాగే లింగయ్య పల్లి బీసీ మహిళ, చింతలపల్లి బీసీ జనరల్, 9. గుడిసెల పల్లె బీసీ జనరల్, కలమడుగు బీసీ మహిళ, చింతగూడ బీసీ జనరల్, రేండ్లగూడ బీసీ మహిళ, జన్నారం బీసీ మహిళ, పొనకల్ బీసీ మహిళ, రాంపూర్ బీసీ జనరల్, కిష్టాపూర్ బీసీ జనరల్ అలాగే మురిమడుగు జనరల్ మహిళ, కొత్తపేట్ జనరల్ మహిళ, వెంకటాపూర్ జనరల్, కామన్ పల్లి జనరల్ లను కేటాయించడం జరిగిందని ఉమర్ షరీఫ్ తెలిపారు.

15 ఎంపీటీసీల రిజర్వేషన్ల జాబితా :

జన్నారం మండలంలోని 15 ఎంపీటీసీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను సైతం ప్రకటించడం జరిగిందని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంధన్ పల్లి ఎంపీటీసీ స్థానానికి ఎస్టీ మహిళ, మొర్రిగూడ ఎస్టీ జనరల్, అలాగే కవ్వాల్ ఎస్సీ జనరల్, లింగయ్య పల్లె ఎస్సీ మహిళ, దేవుని గూడా ఎస్సీ జనరల్, రోటి గూడ ఎస్సీ మహిళ, అదేవిధంగా తపాలాపూర్ బీసీ మహిళ, కలమడుగు బీసీ జనరల్, చింతగూడ బిసి మహిళ, పొనకల్ బీసీ జనరల్, జన్నారం బీసీ మహిళ, రేండ్లగూడ బీసీ జనరల్, అలాగే చింతలపల్లి జనరల్, మురిమడుగు మహిళా జనరల్, రాంపూర్ ఎంపీటీసీ స్థానాన్ని జనరల్ కు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -