Thursday, January 15, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నారు

ఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నారు

- Advertisement -

రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈనెల13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ మీట్‌ నిర్వహించారు.
నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ, ‘మా సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌. మా హీరో రవితేజకి, హీరోయిన్స్‌కి, మా సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మా టెక్నీషియన్స్‌ ప్రకాష్‌, ప్రసాద్‌, బీమ్స్‌, కొరియోగ్రాఫర్స్‌, రైటర్స్‌ అందరికీ చాలా థ్యాంక్స్‌. నేను రెండుసార్లు భ్రమరాంభ థియేటర్‌కి వెళ్ళాను. ఫ్యామిలీ ఆడియన్స్‌, పిల్లలు చాలా ఎంజారు చేస్తున్నారు. ఈ సినిమా టికెట్‌ రేట్లు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే ఉన్నాయి. తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్స్‌ రూ. 175, మల్టీప్లెక్స్‌ రూ. 200, ఆంధ్రాలో సింగిల్‌ స్క్రీన్‌ రూ.195, మల్టీప్లెక్స్‌ రూ.250 ఉన్నాయి. అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజారు చేయండి’ అని తెలిపారు.
‘బిగినింగ్‌ నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. మేము అనుకున్న టార్గెట్‌ని 100% రీచ్‌ అయ్యాం. ఆడియన్స్‌ నాన్‌ స్టాప్‌గా నవ్వుతున్నారు. అన్ని పాత్రలు కూడా హిలేరియస్‌గా ఉన్నాయి. నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ హ్యాపీగా చూడొచ్చు అని అంటారు. ఈ సినిమాతో ఆ ఆడియన్స్‌ డబుల్‌ అయ్యారు. ఈ సినిమా అందరికీ ఇంత బాగా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియో బ్లాక్‌బస్టర్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ అంతా బీమ్స్‌కి వెళుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా నెక్స్ట్‌ లెవెల్‌ ఇచ్చారు’ అని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -