Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅవి ఇంట్లో నుంచి తెచ్చుకున్న మందులు

అవి ఇంట్లో నుంచి తెచ్చుకున్న మందులు

- Advertisement -

ఆసియా బేగం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ రసూల్‌పురా బస్తీ దవాఖానాలో ఆఫియా బేగం అనే పేషెంట్‌కు ఎక్స్‌పైర్డ్‌ ట్యాబ్లెట్స్‌ ఇచ్చారంటూ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వర్కర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలింది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వర్కర్‌ చూపించిన పేషెంట్‌ ఆఫియా బేగం గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను రెగ్యులర్‌గా రసూల్‌పురా బస్తీ దవాఖానాలో చికిత్స చేయించుకుంటానని ఆమె తెలిపారు. ఈ నెల 21న జలుబు, జ్వరంతో బస్తీ దవాఖానకు వచ్చాననీ, వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న మందులను కూడా తీసుకొచ్చానని ఆమె వెల్లడించారు. ఆ మందులనే బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వర్కర్‌ తన దగ్గర్నుంచి తీసుకున్నారని ఆఫియా బేగం వివరించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వర్కర్‌ చెప్పిన దాంట్లో వాస్తవం లేదనీ, తనకు ఆ మందులు ఆ రోజు బస్తీ దవాఖానాలో ఇవ్వలేదని ఆఫియా బేగం స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -