Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు

- Advertisement -

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బల్మూరి వెంకట్‌ ఫైర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ జీవితం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వంటా, వార్పు క్రాస్‌రోడ్డులో కాదు…మీ బాపు ఉన్న ఫామ్‌హౌస్‌ ముందు చేయాలి’ అని కవితకు సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నోటిఫికేషన్లు రాకా, వేసిన నోటిఫికేషన్లను కోర్టు కేసుల్లో ఇరికించి నిరుద్యోగులతో చెలగాటమాడారని తెలిపారు. ఇప్పటికే 60 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని శాఖల నోటిఫికేషన్లు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయని తెలిపారు. నిరుద్యోగులంతా రాజకీయ కుట్రలకు దూరంగా ఉంటూ…పరీక్షలకు సన్నద్దం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -