రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె.యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈనెల 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించారు. హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ,’ఈ కథ కంటే ముందు నేను విన్న కథలన్నీ కూడా రక్తపాతంతో కూడుకున్నవే. కానీ ఈ కథ విన్న వెంటనే సినిమా చేయాలని అనిపించింది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం. మా సినిమాని ఈనెల 6న రిలీజ్ చేయబోతున్నాం. మా మూవీని చూసి బాగుందా? లేదా? అనే అభిప్రాయాన్ని ఆడియన్స్ చెబుతారని ఆశిస్తున్నాను. మా చిత్రాన్ని చూసి థియేటర్ నుంచి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను.
అయితే ఈ మధ్యకాలంలో తరచూ సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. దీంతో మాలాంటి చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. ముఖ్యంగా శుక్రవారం రోజు రీ-రిలీజ్‌లు ఉండటం వల్ల థియేటర్ల విషయంలో మరింత సమస్యాత్మకంగా ఉంటోంది. దీని గురించి పరిశ్రమ పెద్దలందరూ ఆలోచించి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను’ అని నిర్మాత కె. హిమబిందు చెప్పారు. దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ,’మేమంతా కొత్త వాళ్లం. దీంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా కూడా తప్పులు జరగ కుండా చూసుకున్నాం. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అందరూ చూసి మెచ్చుకునేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు. కొరియోగ్రాఫర్ కృష్ణ ప్రసాద్, ఎడిటర్ విశ్వనాధ్ కూచనపల్లి, సంగీత దర్శకుడు పవన్, కాస్ట్యూమ్ డిజైనర్ రెతీషా రెడ్డి, సినిమాటోగ్రాఫర్ పవన్ గుంటుకు తదితరులు ఈ వేడుకలో పాల్గొని ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉండే ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నవ్వుతూ బయటకు వస్తారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



