ప్రమాదాలకు నిలయంగా నందిపాడు రోడ్డు
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణ లోని ప్రధాన రోడ్డు అయిన టాకా రోడ్డు లోని లెక్చరర్ అపార్ట్మెంట్ నుంచి నంది పాడ్ బై పాస్ వరకు రోడ్డు అధ్వాన్నంగా మారింది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు వెడల్పు కోసం గత 2 నెలల క్రితం రోడ్డునును తవ్వారు. సుమారు అర కిలో మీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డు బారీ గుంతలతో దర్శనమిస్తుంది. ఈ రోడ్డు వెంట నిత్యం వందలాది వాహనాలు స్కూల్ బస్సులు, ఆటోలు, ద్వి చక్రా వాహనాలు, కార్లు నిత్యం తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ రోడ్డు పై నుంచే నందిపాడు, నందిపాడు క్యాంపు, వాటర్ ట్యాంకు తండా, ఐలాపురం, చిల్లాపురం, గోప సముద్ర తండాతో పాటు అనేక తండాల వాసులు మిర్యాలగూడ పట్టణానికి వచ్చి వెళుతుంటారు.
గత 2 నెలల నుంచి రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పైపులైన్లు కోసం పనులు చేపట్టారు. పని పూర్తి అయి నెలరోజులు గడుస్తున్న త్రవ్విన రోడ్డు గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. కనీసం నడిచే పరిస్థితి లేదు. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, విద్యార్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. గర్భిణీ ఈ రోడ్డు పై వెళితే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. పైగా అకాల వర్షాలు పడుతున్నందున వర్షపు నీరు గుంతలో చేరి ఎక్కడ గుంతలు ఉన్నాయో, తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికీ అనేక మంది ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగి గాయాలపాలైన సంఘటనలున్నాయి. నిత్యం నరకయాతన అనుభవిస్తూ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డును తవ్వారు… గుంతలను వదిలేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES