హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చిన సీఎం రేవంత్ : మాజీమంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆయన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే అదే వేదికపై రేవంత్‌రెడ్డి అసలు స్వభావాన్ని, మాటల ద్వారా బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని తెలిపారు. హేట్ స్పీచ్ అంటే ఏంటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదనీ, సీఎం ప్రసంగాలు చాలని పేర్కొన్నారు. అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో నాలుగు రోజులు చదువుకున్నా ఆయన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని తెలిపారు. కనీస సంస్కారం రాలేదనీ, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని వివరించారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్టే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతి పితనే అని తెలిపారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఆయనకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా?అని తెలిపారు. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న ఆయనకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా?అని పేర్కొన్నారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌కు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఎలా అర్థమవుతాయని వివరించారు. ఆయన అమెరికాలోని హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా చెత్త బుద్ధి మారదనీ, నోటి మురికి పోదని తెలిపారు.
కేసీఆర్‌పై కడుపులో కత్తులు..నోటిలో విషం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



