ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో సంభాషించారు.
-కన్నడలో ఎస్.నారాయణ అనే దర్శకుడి వద్ద పని చేశాను. సుహాస్ నాకు స్కూల్‌లో జూనియర్. ‘కలర్ ఫోటో’ నుంచి సుహాస్‌తో జర్నీ చేస్తూనే ఉన్నాను. ‘రైటర్ పద్మభూషణ్’కి కూడా నేను పని చేశాను. ఈ కథను సుహాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. స్క్రిప్ట్‌లో తన ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ లేదు. కానీ సెట్స్ మీద మాత్రం తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉండేవాడు.
-కామెడీతో పాటు ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని చాలా కొత్తగా చూపించాం. అందరినీ ఆకట్టుకునే సినిమా ఇది.
-మన జీవితంలో ‘హే భగవాన్’ అని అనుకునే సందర్భాలెన్నో ఎదురవుతాయి. ఈ చిత్రంలోని పాత్రలకి కూడా అలాంటి ఘటనలెన్నో ఎదురవుతాయి. ఈ సినిమాకి ఈ టైటిల్ వంద శాతం సెట్ అవుతుంది.
-నిర్మాత ఇది వరకు కన్నడలో ఓ సినిమాని చేశారు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈ ప్రయాణంలో ఆయన మాకెంతో సపోర్ట్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకి ఏం కావాలో, ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. వంశీ నందిపాటి స్క్రిప్ట్ దశ నుంచీ ఈ ప్రయాణంలో ఉన్నారు. ఆయన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. వారికి సినిమా చాలా నచ్చింది. అందుకే ఈ మూవీని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
-ఈ మూవీని ఇప్పటికే చాలా మందికి చూపించాం. సినిమాని చూసిన వారంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని ప్రశంసలు కురిపించారు.
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



