Thursday, November 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కాంక్రీట్ వేశారు.. తారు మరిచారు

కాంక్రీట్ వేశారు.. తారు మరిచారు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రం నుంచి కవ్వాల్ వరకు 15 కిలోమీటర్ల రోడ్డు రెన్యువల్ పనులను రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టారు. 18 నెలల క్రితం కాంక్రీట్ వేసి తారు వేయడం మరిచిపోయారు. దీంతో కవ్వాల్, దేవుని గూడా, కామన్పల్లి, కిష్టాపూర్, బంగారు తండా లోతోర్రే  చర్లపల్లి  తదితర గ్రామాల ప్రజలు పట్టణానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. విచ్చలవిడిగా కాంక్రీట్ ఉండడంతో, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఆ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నారు. పెద్ద  వాహనాల వెనుక వెళ్తుంటే దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు. కాంక్రీట్ రోడ్డుపై తారు వేసి  ఆ ప్రాంత ప్రజల ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.  అధికారులు వెంటనే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -