Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమాహాయిగా నవ్వుకుంటారు

హాయిగా నవ్వుకుంటారు

- Advertisement -

‘రామాయణంలో సీతమ్మ వారి దగ్గరికి వెళ్లి రాముల వారిచ్చిన ఉంగరాన్ని హనుమంతుడు చూపించే ఘట్టం సుందరకాండ. అదొక సెలబ్రేషన్‌. అయితే సెలబ్రేషన్‌కి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అలా మా హీరో కూడా ఒక విషయాన్ని ఎచీవ్‌ చేయాలనుకుంటారు. దానికి ఆయన పెట్టే ఎఫెర్ట్స్‌ ఏమిటనేది కథ. అలా ఈ చిత్రానికి ‘సుందరకాండ’ అనే టైటిల్‌ పెట్టాం’ అని దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి అన్నారు.
నారా రోహిత్‌ హీరోగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ బ్యానర్‌పై సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మించారు. వతి వాఘాని, శ్రీ దేవి విజరు కుమార్‌ హీరోయిన్లు.
ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి మీడియాతో మాట్లాడుతూ, ‘రోహిత్‌కు ఈ కథ రాసి పంపించాను. ఆయన చదివి బాగా ఇంప్రెస్‌ అయ్యారు. అలా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. హీరో క్యారెక్టర్‌ రాయడానికి అందరి ఇన్స్పిరేషన్‌ ఉంది (నవ్వుతూ). 30 దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయతీ అనుకుంటే, ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కోనే పర్సన్‌ ఉంటే ఎలా ఉంటుంది?, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ కథ. ఈ సినిమా కోసం శ్రీదేవి విజరు కుమార్‌ని ఎంపిక చేయడానికి కారణం ఏంటంటే, రెండు డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్‌ ఉన్న లవ్‌ స్టోరీ ఇది. రోహిత్‌ కంటే ఏజ్‌గా కనిపించాలి అదే సమయంలో బ్యూటీÄఫుల్‌గా ఉండాలి. అందుకే శ్రీదేవి విజరు కుమార్‌ని ఎంపిక చేసుకున్నాం. అలాగే కథానాయిక వతి వాఘాని క్యారెక్టర్‌కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. నరేష్‌, సునైనా, వాసుకి పాత్రలు కూడా చాలా బాగుంటాయి. లియోన్‌ జేమ్స్‌ చాలా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. సినిమా చూస్తున్నపుడు ఆడియన్స్‌ హాయిగా నవ్వుతూనే ఉంటారు. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఇచ్చారు’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad