Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంకర పోశారు... పనులు మరిచారు 

కంకర పోశారు… పనులు మరిచారు 

- Advertisement -

గ్రామస్తులకు తప్పని తిప్పలు 
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – బొమ్మలరామారం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రోడ్డు నిర్మాణ కోసం కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నాయి. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యంతో పనులు నత్తనడకగా సాగడంతో గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రూ.18 కోట్ల వ్యయంతో బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామం నుంచి భువనగిరి మండలం వడపర్తి గ్రామం వరకు సుమారు 11 కిలోమీటర్ల రోడ్డును విస్తరించినందుకు ఆర్అండ్ బి నుంచి 2024 లో రూ.18 కోట్లు మంజూరు చేసింది. అధికారులు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు నత్త నడకగా సాగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నెలలు గడుస్తున్న పనులు మాత్రం పూర్తికాలేదు. కంకర వేసి వదిలేయడంతో ఈ మార్గం లో రాకపోకలు సాగించే వాహనదారులు నాన ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమత్తుల భాగంగా కంకర వేశారు కానీ కంకర కాస్త పొడి రూపంలో మారిపోయింది. రోడ్డు పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కంకర రోడ్డుతో కష్టాలు తప్పడం లేదు, దీనికీ తోడు వర్షాలు కురవడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, విన్నవించిన ఎవరు పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోడ్డు గుండా రాత్రి ప్రయాణం చేయాలంటేనే అరచేతులు ప్రాణం పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -