Sunday, January 25, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్‌ను పంపించారు

బంగ్లాదేశ్‌ను పంపించారు

- Advertisement -

ఆ స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌

దుబాయ్ : భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించి, తమ మ్యాచ్‌లను శ్రీలంక షెడ్యూల్‌ చేయాలని పదేపదే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)ని కోరిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అంతిమంగా మింగుడు పడని చేదు గుళికే ఎదురైంది. బంగ్లాదేశ్‌ అభ్యర్థనలను తోసిపుచ్చిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం… ఆ జట్టుకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌లో ఆడమని తేల్చిచెప్పిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు టీ20 ప్రపంచకప్‌లో చోటు కల్పించింది. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మండిపడింది. బంగ్లాకు బాసటగా పాకిస్తాన్‌ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -