నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. హిట్ జోడి శివాజీ, లయ ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు. శివాజీ, ఈటీవీ విన్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ, ‘లక్కీ కాంబినేషన్ ఈటీవీ విన్, బన్నీవాస్, వంశీ నందిపాటి ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. సినిమాకు ఉండే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో మాజా వేరు.
థియేటర్‌లో చూస్తేనే కిక్కు. బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీకి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్‌గా నవ్వుకున్నారు. ఫైనల్‌గా ఇది థియేటర్‌లోకి రావాలని డిసైడ్ చేశాం. ఈ సినిమా థియేటర్‌లో రావడానికి కారణమైన దర్శకుడు అనిల్ రావిపూడికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు. ‘చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. ఈ సినిమా థియేటర్‌లో చూడలేకపోతానేమో అని బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఈసినిమా థియేటర్‌లో రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని అంశాలు సినిమా విజయానికి ప్లస్ అయ్యే విధంగా ఉంటాయి. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి శ్రీకారం అని నమ్ముతున్నాను’ అని లయ చెప్పారు.
ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారు
- Advertisement -
- Advertisement -



