నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రజలకు హమీలు, ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులు ఇంకా ఎన్నేళ్లయినా గవే ఆశలు చూపుతారే తప్ప ఏ ఒక్కటి నెరవేర్చరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని రాజగృహాలో బుధవారం మల్హర్ మండలం అన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసర్ల రాజయ్య, మాజీ సైనికుడు భనోత్ రాజు కుమార్ (డిల్లీ రాజు), లావుడ్య రాణా సింగ్,ఇంజపూరి కుమార్ యాదవ్,ధరంసోత్ లక్ష్మణ్ నాయక్, నాంసాని కుమార్ యాదవ్, లావుడ్య రాజు, తోట్ల సమ్మయ్య, జంగ పెద్ద అయిలయ్య, తోట్ల ఓదెలు, భనోత్ సింగనాయక్, లావుడ్య తిరుపతి, గుగులోత్ చిన్న రాజు, లావుడ్య రవీందర్, గుగులోత్ రాజేష్, లావుడ్య శ్రీధర్, లావుడ్య తరుణ్, భూక్య రాజేష్, లావుడ్య సతీష్, లావుడ్య నరేష్, తొట్ల కుమార్ యాదవ్, బానోత్ తిరుపతి, లావుడ్య శ్రీనివాస్, సజ్జల శ్రీకాంత్, సజ్జల గణేష్, బూడిది రమేష్, అజ్మీరా శివాజీ, గుగులోతు ప్రశాంత్, భూక్యా శ్రీనివాస్, గుగులోత్ దేవేందర్ తోపాటు పెద్ద ఎత్తున సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈసందర్బంగా పుట్ట మాట్లాడారు 24నెలల కాలంలో కాంగ్రెస్ పనితీరును ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ అప్పు చేసైనా పప్పు కూడు పెట్టిండని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్పులు చేసి ఢిల్లీకి మూటలు మోసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇచ్చిన హమీలను తుంగలోతొక్కారని ఎద్దేవా చేశారు.నమ్ముకున్న కార్యకర్తలు తమ ప్రభుత్వం వస్తే ఏదోచేస్తామని ఆశపడితే తమ ఇంట్లో వాళ్లే తిట్టే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. ఇంట్లో అవ్వ నాలుగు వేల పించన్, అక్క 2500మహాలక్ష్మి, బయటకు పోతే రైతులు రైతుబంధు, రైతుబీమా, బోనస్ ఏదని అడుగుతుంటే అవమానాలకు గురవుతున్నారని తెలిపారు. ఈనాడు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగలేని పరిస్థితులు నెలకొనడాన్ని గమనించిన అన్‌సాన్‌పల్లి వాసుల్లో చైతన్యం వచ్చిందని, తూర్పు నుంచే ఉద్యమంలా మొదలైందన్నారు.
అయితే పాత వాళ్లు కొత్త వాళ్లను కలుపుకుని రావడం శుభసూచికమని,ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని పుట్ట పిలుపునిచ్చారు.గ్రామాల్లో పాత వాతావరణం రావాలంటే, గ్రామ అభివృధ్ది కనబడాలంటే మన ఊరు పార్టీ, మన రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు.ఇంకా మూడేళ్ల సమయం ఉంది మీ అవసరాలు తీర్చుతామని చెప్పినా వినకుండా బీఆర్‌ఎస్‌లోకి రావడం అభినందనీయమని, ఇంకా మూడేళ్లయినా కాంగ్రెస్ పార్టీ ఆశలు మాత్రమే చూపిస్తుందన్నారు.నియోజకవర్గంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వకపోగా, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నా హామీ అమలు చేయలేదన్నారు. ఉన్న గురుకుల, మోడల్ స్కూల్స్ నిర్వహణను గాలికి వదిలేశారని, కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మంథని మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, ముత్యాల రాజేందర్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాసాని శ్రీషేలం పాల్గొన్నారు.



