బీహార్ ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా ఎన్డీఏ నేతలు మతోన్మాద, కులతత్వ విద్వేషాలతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి సమీకరణ ఎత్తుగడుల ద్వారా ఎన్డీఏ లబ్ది పొందిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దుర్మార్గమైన ఈ ఎత్తుగడకు కార్పొరేట్ మీడియా మరింతగా పెంచి పోషించి..మహాగట్‌బంధన్ లేవనెత్తిన ప్రజా సమస్యలను నితీశ్ సర్కార్ నీరుగార్చిందని విమర్శించింది. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు మరింత సమైక్యంగా కృషి చేసి వుండాల్సిందని బీహార్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడం మహాగట్‌బంధన్‌కు ఎదురు దెబ్బ అని పేర్కొంది. పాలక సంకీర్ణ కూటమి (ఎన్డీఏ) మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని, అనేక రకాలుగా అవకతవకలకు పాల్పడుతూ, పెద్ద మొత్తంలో డబ్బును వెదజల్లిందని విమర్శించింది. ఈ ఫలితాల వెనుక గల ఇతర కారణాలను సీపీఐ(ఎం) మరింత సవివరంగా సమీక్షిస్తుందని తెలిపింది. సీపీఐ(ఎం) అభ్యర్థులకు, ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలందరికీ పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు తెలియచేసింది. అణచివేతకు, దోపిడీకి గురవుతున్న ప్రజల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సీపీఐ(ఎం) హామీ ఇచ్చింది.
కుల, మతోన్మాద విద్వేషాలతో గెలిచారు
- Advertisement -
- Advertisement -



