Tuesday, October 14, 2025
E-PAPER
Homeజిల్లాలురాజోలి నుంచి శాంతినగర్ వరకు రోడ్డు వేయాలని రాస్తారోకో

రాజోలి నుంచి శాంతినగర్ వరకు రోడ్డు వేయాలని రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
ప్రజల ప్రాణాలు పోతున్నా.. పాలకులకు పట్టడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు అన్నారు. మంగళవారం రాజోలి పోలిమేర నుండి శాంతినగర్ వరకు రోడ్డు వేయాలని కెవిపిఎస్ మండల అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి జిల్లా కార్యదర్శి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు పోతున్న పాలకులు అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

మూడు కిలోమీటర్ల పరిధికి ప్రయాణం 30 నిమిషాలు పడుతుందని గర్భిణీ స్త్రీలు వృద్ధులు స్కూల్ విద్యార్థులు ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాత్రి వేళల్లో ఇసుక మాఫియాకు చెందిన టిప్పర్లు తిరగడం వల్ల రోడ్డు మొత్తం అధ్వానంగా తయారైందని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడే నాయకులు కమిషన్లు వచ్చే పనులకు జీవోలు తెస్తూ రెండు మండలాల మధ్య ఉన్న రోడ్డు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రెండు రోజులలోపు రోడ్డుకు మరమ్మతులు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇందిరమ్మ రాజ్యం  ప్రజా పాలన అంటే రోడ్డు వేయకపోవడమా ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడమా అని ప్రశ్నించారు అంతకుముందు వడ్డేపల్లి రాజోలి మండలాల ఎస్సైలు వచ్చి నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని, రాస్తారోకో విరమించాలని కోరారు. పోలీసులకు నాయకులకు మధ్య వాదపవాదాలు జరిగాయి. రాజోలి వడ్డేపల్లి మండలాల తాసిల్దార్లు రాస్తారోకో దగ్గరకు వచ్చి రెండు రోజులలోపు మొరం వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజోలి మండల అధ్యక్షుడు ఆర్ విజయ్ కుమార్ రాజోలి గ్రామ ఉపసర్పంచ్ ఎం గోపాల్ తెలంగాణ ఉద్యమకారుడు గోపాల్ రెడ్డి మున్నా మహేశ్వర్ రెడ్డి జయన్న గోకారి కార్పెంటర్ రాజు సుందరాజు రవి మహేష్ సురేష్ శీను బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -