- Advertisement -
– జుక్కల్ గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు..
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఆలయానికి సంబంధించిన మూడు పెద్ద ఆవులను 9 ఆవు దూడలు ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని జుక్కల్ గ్రామస్తులు మంగవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువకుడు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవులు అపహరణకు గురయ్యాయని అన్నారు. 9 ఆవుల విలువ దాదాపుగా రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు. గత 20 రోజుల నుండి పశువులు కనిపించడం లేదని ఆయన వాపోయారు. గ్రామ పెద్దలు, యువతకులతో కలిసి ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదును పోలీసులకు అందించారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని ఈ సందర్భంగా డిమండ్ చేశారు.

- Advertisement -



