Sunday, March 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'తిమ్మరాజుపల్లి టీవీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర గ్రాండ్‌ రివీల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. డైరెక్టర్‌ వి.మునిరాజు మాట్లాడుతూ,’నాపై నమ్మకం ఉంచి ఈ సినిమా డైరెక్ట్‌ చేసే అవకాశం కల్పించిన కిరణ్‌కు థ్యాంక్స్‌. మనం ఎంత మంచి కథ రాసినా, అది పర్‌ఫార్మ్‌ చేసే ఆర్టిస్టులు కావాలి. ఒక నాటకం చూసి ఈ కాస్టింగ్‌ అందరినీ సెలెక్ట్‌ చేసుకున్నాను. వాళ్లంతా అద్భుతంగా పర్‌ఫార్మ్‌ చేశారు. టెక్నికల్‌గా ప్రతి ఒక్కరూ సపోర్ట్‌ చేశారు. ఈ మూవీ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్తారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌, సస్పెన్స్‌తో పాటు ఎమోషన్‌కు గురవుతారు’ అని అన్నారు. ‘మునిరాజు మా మూవీస్‌కు ఆన్‌ లైన్‌ ఎడిటింగ్‌ చేసేవాడు. అతను చేసిన ఎడిటింగ్‌ చూస్తుంటే ఆకట్టుకునేలా ఉండేది. ఇండస్ట్రీలో నీ గోల్‌ ఏంటి అని అడిగాను. డైరెక్టర్‌ కావాలని ఉందని చెప్పాడు. ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నాను. అప్పటికి డబ్బులు లేవు, సినిమా చేస్తానో లేదో తెలియదు. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒకే టీవీ ఉండేది. ఊరి వాళ్లంతా ఆ ఇంటికి వెళ్లి టీవీ చూసేవారు. అలాంటి సంఘటన ముని వాళ్ల ఊరిలో ఒకటి జరిగింది. శివరాత్రి పండక్కి మూడు రోజులు టీవీ అద్దెకు తీసుకొచ్చి ఊరి వాళ్లంతా కలిసి సినిమాలు చూస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారట. ఇది ఫ్యూర్‌గా, హానెస్ట్‌గా మేమంతా చేసిన ప్రయత్నం. చిన్న బడ్జెట్‌లో చిన్న స్టోరీ లైన్‌తో మేము చేసిన చిత్రమిది. ఏప్రిల్‌ 17న సినిమా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సమ్మర్‌ హాలీడేస్‌లో మీరు మా మూవీ చూస్తూ ఆ ఊరు ప్రజల క్యారెక్టర్స్‌తో కనెక్ట్‌ అవుతారు’ అని నిర్మాత, హీరో కిరణ్‌ అబ్బవరం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -