తూకం వేసిన వడ్లను తరలించాలి…
రోడ్డుపై బైఠాయించిన రైతులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి: వడ్ల కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకపోతున్నాయని వెంటనే సన్న వడ్లను తూకం వేయాలని రైతు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని జిల్లెల్లలో రైతులు పండించిన పంట గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ మంగళవారం రైతులు సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఐకెపి కొనుగోలు కేంద్రంలో సన్నబడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో సన్న వడ్లను పండించాలని చెప్పడంతో చాలామంది రైతులు సన్నవడ్లను మాత్రమే పండించారని ఇప్పుడు ఈ సన్నవడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు ఎలా బ్రతికేది అన్నారు. ఇప్పటికే వడ్ల కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వడ్ల బస్తాలు ఇక్కడే నిల్వ చేశారన్నారు. చాలా రోజులుగా లారీలు రాక తూకం వేసిన వడ్లు కొనుగోలు కేంద్రంలోనే విలువ చేశారన్నారు. వడ్లను కొనుగోలు చేసి లారీలలో తరలించిన వడ్లకు ఇప్పటివరకు రైతుల ఖాతాలో ఏ ఒక్క రూపాయి కూడా జమ కాలేదని వాపోయారు. సన్న వడ్లను కొనుగోలు చేయరు. కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లులకు తరలించారు. బిల్లులకు తరలించిన వడ్లకు రైతులకు డబ్బులు ఇవ్వరు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని సన్న రకం వడ్లను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లులకు తరలించాలని, తరలించిన వడ్లకు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ రాస్తారోకోలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు.
సన్న వడ్లను తూకం వేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES