Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడో విడత ఎన్నికలు.. ఈ మండలాల్లో మద్యం షాపులు మూసివేత

మూడో విడత ఎన్నికలు.. ఈ మండలాల్లో మద్యం షాపులు మూసివేత

- Advertisement -

జిల్లా మద్యపాన నిషేధ అధికారి ఎం.విష్ణుమూర్తి 
నవతెలంగాణ – ఆలేరు 

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో విడత జరిగే ఎన్నికల్లో ఆరు మండలాల గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు భువనగిరి ఎక్సైజ్ సూపర్డెంట్ ఎం విష్ణుమూర్తి తెలిపారు. సోమవారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ మినహా గ్రామం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న చౌటుప్పల్, నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోట కొండూరు మండలాలో గల మద్యం షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు. 17వ తేదీన ఆయా గ్రామాల్లో ఎన్నికల పూర్తిగా ముగిసిన తర్వాత ఎక్సైజ్ అధికారుల అనుమతితో మాత్రమే షాపులు తెరవాలి అన్నారు.ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -