Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్భారీ వాహనాలపై ఆంక్షలు ఎత్తివేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి..

భారీ వాహనాలపై ఆంక్షలు ఎత్తివేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తేనే  ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, రాష్ట్ర నాయకులు విజయ్ ధర్మ, సిటీమల భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గత మూడు రోజులుగా  అటవీ అంశాలను ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు  భూమాచారి, బిజెపి ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్ కు మద్దతు పలికారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలోని జన్నారం దస్తురాబాద్ కడెం ఖానాపూర్, ఇంద్రవెల్లి ఉట్నూర్ మండలాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.

ఈ మండలాలు అభివృద్ధి చెందాలంటే టైగర్ జోన్ పూర్తిగా ఎత్తివేయాలన్నారు. లేకుంటే కనీసం భారీ వాహనాలకైనా అనుమతి ఇవ్వాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చాక ఆంక్షలు ఎత్తివేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలం చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అంశాలను ఎత్తివేయడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు విఫలం చెందుతున్నారు అన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే అటవీ అంశాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అప్పటివరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు ఈ దీక్షకు అన్ని కులమత, పార్టీల ప్రాంతీలకు అతీతంగా మద్దతు తెలుపాలని కోరుతున్నాం అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు  ఫజల్ ఖాన్, రాగుల శంకర్, రవి ముదిరాజ్, దుమల ఎల్లయ్య, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మండల మైనార్టీ సంఘ నాయకుల మద్దతు..
రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి మండల మండల మైనార్టీ జామా మసీద్ సంఘ నాయకులు మద్దతు పలికారు. అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ సర్దార్ ఖాన్ వసీం  పటేల్ బాబా ముజ్జు సోహెల్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -