Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ బర్త్‌డే నాకెంతో ప్రత్యేకం..

ఈ బర్త్‌డే నాకెంతో ప్రత్యేకం..

- Advertisement -

‘ఇటీవల రిలీజై, విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ‘జిగ్రీస్‌’ నిలవడం, అందులో నేను పోషించినపాత్రకు మంచి పేరు రావడం.. నటుడిగా నాలో సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇలాంటి తరుణంలో జరుపుకుంటున్న ఈ బర్త్‌డే నాకెంతో ప్రత్యేకం’ అని అంటున్నారు హీరో కృష్ణ బూరుగుల. నేడు (శుక్రవారం) ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చేతికిగా దెబ్బ తగిలి, ఫ్రాక్చర్‌ అయినప్పటికీ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆడిషన్‌లో పాల్గొన్నాను. ఆ మూవీలో ఓ చిన్న రోల్‌ చేశాను. అది ఎడిటింగ్‌లో పోయింది. కానీ ఆ మూవీకి చేసిన ఆడిషన్‌, ఆ సమయంలో నా సిట్యువేషన్‌.. ఇవన్నీ నాలో తెలియని కాన్ఫిడెన్స్‌ పెంచి ఎనర్జీనిచ్చింది.

రవిబాబు డైరెక్ట్‌ చేసిన ‘క్రష్‌’ మూవీ హీరోగా నాకు డెబ్యూ మూవీ. తర్వాత ‘మానాన్న నక్సలైట్‌’, హరీష్‌ శంకర్‌ షో రన్నర్‌గా చేసిన ‘ఏటీఎం’ వెబ్‌ సిరీస్‌, కొరటాల శివ సమర్పణలో వచ్చిన ‘కృష్ణమ్మ’లో నటించాను. ఇక ‘జిగ్రీస్‌’ విషయానికి వస్తే.. నాది రగ్డ్‌, చిచోరే పాత్ర. పాత్రకు తగ్గట్టు లుక్‌, నా నటన బాగుండటంతో అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యాను. డైరెక్టర్‌ సందీప్‌ వంగా సినిమా చూసి చాలా బాగా చేశానని అప్రిషియేట్‌ చేశారు. ఇంత రెస్పాన్స్‌ వస్తుందని నేను అనుకోలేదు. త్వరలోనే సినిమాను స్టార్ట్‌ చేస్తాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -