Thursday, February 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ పుస్తకం చాలు..

ఈ పుస్తకం చాలు..

- Advertisement -

‘శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి’ లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు, నేను యూనివర్సిటీలో ఉంటే డాక్టరేట్‌ ఇప్పించేవాడిని అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రచించిన ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’ పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్లో జరిగింది. ‘భగీరథ రాసిన పుస్తకాలు ఆయనలోని గొప్ప పరిశోధకుడిని మనకు పరిచయం చేస్తాయి’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్‌ చెప్పారు. దర్శకుడు బి.గోపాల్‌ మాట్లాడుతూ,’రచయితగా భగీరథది ఎంతో విలక్షణమైన శైలి’ అని తెలిపారు. ‘కృష్ణవేణమ్మ మాలాంటి నటీమణులకు ఆదర్శం’ అని రోజారమణి చెప్పారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ‘కృష్ణవేణమ్మ మీద బయోపిక్‌ తీయవచ్చు, అందుకు ఈ ఒక్క పుస్తకం చాలు’ అని చెప్పారు.

పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ,’ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారకురాలు అనురాధ దేవి. ఆమె సహకారం లేకపోతే ఈ గ్రంథం వెలువడేదే కాదు. కృష్ణవేణమ్మ జీవితం ఈ తరం వారందరికీ స్ఫూర్తి దాయకం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని చెప్పారు. ఈ సందర్భంగా రచయిత భగీరథను జర్నలిస్ట్‌ మిత్రులంతా ఆత్మీయంగా సత్కరించారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాతలు మాగంటి మురళి మోహన్‌, కె.ఎస్‌.రామారావు, కైకాల నాగేశ్వరరావు, కె.అశోకుమార్‌, రాశీ మూవీస్‌ నరసింహారావు, డి.వి.కె రాజు, అట్లూరి నాగేశ్వరరావు, అక్కినేని నాగ సుశీల, కాజా సూర్యనారాయణ, తుమ్మల రంగారావు, సారిపల్లి కొండలరావు, శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌, బిక్కి కృష్ణ, రామలక్ష్మి, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -