నీ చూపు సోకక
నా ఈ కళ్లు ఎండిపోతున్నాయి
నీ నవ్వు కానక
నా పెదవులు
మౌనంగా ఏడుస్తున్నాయి
గుండెలో ఒక గాయం
రక్తం కాదు
నీ జ్ఞాపకాలే కారుతున్నాయి
ప్రతి శ్వాసలో నీపేరే ధ్వనిస్తోంది
నువ్వు దూరమైన రోజు నుండి
ఈ గది కూడా నన్ను వదిలేసినట్టుంది
గోడలు నా ఏడుపు వినలేవు
కానీ నా గుండె చప్పుడు
నిన్నే అడుగుతోంది ఎక్కడున్నావ్
వాలెంటైన్స్ రోజు కాదు
నాకు రోజంతా నీవే.
నీవు లేని ప్రతి క్షణం
ఒక శిక్షలా గడుస్తోంది
నా కళ్లలో నీ బొమ్మలు కరిగిపోతున్నాయి
ఇంకా ఎన్నాళ్లు ఈ
ఒంటరి రాత్రులు తట్టుకోగలనో తెలియదు
నువ్వు తిరిగి రాకపోతే
ఈ హృదయం నీ
ఆశలతో చంపేస్తుంది
నా ప్రేమ
నీకు భారమైతే చెప్పు కానీ దయచేసి నన్ను
బ్రతకనివ్వు నీతోనే!
నీవే నా జీవితం
మొదలు… నీవే నా ముగింపు
నీవు లేని ఈ ప్రపంచంలో
నేను ఒక శవం
కానీ ఒక్కసారి
నా పేరు పిలిచి చూడు…
ఆ ఒక్క మాటతోనే నేను మళ్లీ బతికిపోతాను..
-సాధన. తేరాల
నీవు లేని ఈ ఊపిరి… నా మరణం
- Advertisement -
- Advertisement -



