Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఈ జాప్యం.. సముచితమైనదే

ఈ జాప్యం.. సముచితమైనదే

- Advertisement -

– చిరంజీవి
చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీని క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. నేడు(శుక్రవారం) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక స్పెషల్‌ వీడియోతో మెసేజ్‌ రిలీజ్‌ చేస్తూ, సినిమాకు సంబంధించిన ఎగ్జైటింగ్‌ అప్‌డేట్స్‌తో పాటు బర్త్‌డే సర్‌ప్రైజ్‌, రిలీజ్‌ టైమ్‌లైన్‌ను అనౌన్స్‌ చేశారు. స్పెషల్‌ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ,’హాయ్‌.. ఇలా మీ ముందుకు రావడానికి కారణం ‘విశ్వంభర’. చాలా మందికి ఒక డౌట్‌ ఉంది. ఈ చిత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది అని. ఈ ఆలస్యం, జాప్యం చాలా సముచిత మని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా సెకండ్‌ హాఫ్‌ మొత్తం విఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్‌ క్వాలిటీతో అందివ్వాలని దర్శక, నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం.

ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధ శక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది. వినోదపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడెప్పుడా ఎదురుచూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్‌ వాళ్ళు నా పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు గురువారం సాయంత్రం 6:06కి ఒక చిన్న గ్లిమ్స్‌ మనకి అందివ్వబోతున్నారు. అది ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకుంటుంది. అది సరే మరి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పట్లేదే. అది నేను లీక్‌ చేస్తున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలు దీన్ని ఎంజారు చేసే సీజన్‌ సమ్మర్‌ సీజన్‌. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా. ఈ చిత్రం చూడండి. ఆస్వాదించండి, ఆశీర్వదించండి’ అని తెలిపారు.
ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష కష్ణన్‌ నటిస్తుండగా, ఆశికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వశిష్ట.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad